27-09-2025 12:34:09 AM
వర్షాల నేపథ్యంలో వాయిదా
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాగ్ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా పడింది. పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్న.
ఈ చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారం భించాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం దృష్ట్యా ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంయుక్తంగా ప్రకటించారు. ఆదివారం వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.