calender_icon.png 2 May, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లుకు చట్టరూపం కల్పించాలి

02-05-2025 01:37:51 AM

  1. రాష్ట్రాన్ని స్పెషల్ కేసుగా పరిగణించాలి
  2. తెలంగాణ బీసీ కమిషన్ విజ్ఞప్తి

హైదరాబాద్, మే 01 (విజయక్రాంతి): జనాభా లెక్కలతో పాటు బీసీ కులాల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ బీసీ కమిషన్ తెలిపింది. ఖైరతాబాద్‌లోని బీసీ కమి షన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ జీ నిరంజన్, సభు ్యలు పాల్గొని మాట్లాడారు. కేంద్రం చేపట్టే కులగణన పూర్తయ్యేంత వరకు ఆపకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని స్పెషల్ కేసుగా పరిగణించి, రాష్ర్టంలో చేసి న బిల్లులకు చట్టరూపం కల్పించాలని కోరారు.

రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని అఖిల పక్షంతో ప్రధానమం త్రిని కలిసి, ఒప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో   మొత్తం జనాభాలో 56.36 శాతం బీసీలుగా గు ర్తించారని, దానికనుగుణంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రం గాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రెండు బిల్లులు పాస్ చేసినట్టు గుర్తు చేశారు.