02-05-2025 01:36:06 AM
నిజామాబాద్ , మే 1(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ CSAT - 2026 పరీక్ష కోసం 2025-2026 విద్యా సంవత్సర రానికి దరఖాస్తు లు హవానిస్తోంది. ఈ సంవత్సరంలో (100) మైనారిటీస్ (ముస్లిం, క్రైస్తావులు, సిక్కులు, బౌద్దులు మరియు పార్సిల) అభ్యర్థులకు ఉచిత కోచింగ్ను నిర్వహిస్తోంది. ఈ శిక్షణ ఖై రిజర్వేషన్ల నియామకం ప్రకారం మహిళా అభ్యర్థులకు 33.33% సీట్లు మరియు అన్ని రిజరవ్డ్ కేటగిరీలలో వికలాంగులకు 5% సీట్ల కేటా యించి నట్లు తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకొనవలెను మరియు ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుంది.
యుపిఎస్సి (సిఎస్‌ఎటి-2026) యొక్క సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని సాధారణ / ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీస్ అభ్యర్థుల ద్వారా తేది.01-05-2025 నుండి ఆన్లైన్ https://cet.cgg. gov.in/tmreis/TMSCCSATReg25 వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబ డతాయి, దరఖాస్తులు స్వీకరించ డానికి చివరి తేదీ.24-05-2025. ప్రవేశ పరీక్షా తేదీ.05-06-2025 (గురువా రము)న అన్ని జిల్లా కేంద్రములలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశా లలో నిర్వహించపడుతుందని తెలిపారు. అర్హులైన ఆసక్తి కలిగిన మైనారిటీస్ విద్యార్థులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవలని కే.కృష్ణవేణి, నిజామాబాద్ జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి, తెలిపారు. ఇతర వివరములకు నెం.040-23236112 /9700351786 కార్యలయ పని వేళలో సంప్రదించ లని ఆమె కోరారు