calender_icon.png 17 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19న వరంగల్‌లో బీసీల సదస్సు

17-09-2025 12:00:00 AM

  1. రిజర్వేషన్ల పెంపు, భవిష్యత్తు రాజకీయాలపై చర్చ
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, భవిష్యత్తు రాజకీయ ఉద్యమ కార్యాచరణపై చర్చించడానికి ఈ నెల 19న వరంగల్‌లో బీసీల రాజకీయ మేధో మదన సదస్సును నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు.

బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా జరుగుతున్న కుట్రలను ఎండగట్టి, బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా రాష్ట్రంలో మరొక బీసీ రాజకీయ ఉద్యమాన్ని నిర్మించడానికి, అలాగే దసరా పండుగ తర్వాత భువనగిరిలో లక్షలాదిమందితో జరగబోయే బహిరంగ సభ గురించి బీసీల రాజకీయ చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి బీసీ మేధావులు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాల నేతలతో పాటు అన్ని యూనివర్సిటీల విద్యార్థి నేతలు పాల్గొంటారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.