10-11-2025 12:10:15 AM
బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య
15న కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ
కామారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో చేసిన బీసీలకు 42 శాతం డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన బీసీ ఆక్రోశ సభ సన్నాహక సమావేశంలో మా ట్లాడారు. బీసీల అభ్యున్నతికి 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నమన్నారు.
ఒక్కో మండలానికి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి నవోదయ విద్యాలయాలలో అందే స్టాం డర్డ్ విద్యను అందిస్తామని చెప్పారన్నారు. జిల్లాకు ఒక బీసీ కళాశాల ఏర్పాటు చేస్తామని, కులవృత్తులు, కుల సంఘాలకు చే యూతనిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. రిజర్వేషన్లు అమలుకు తొమ్మిదవ షెడ్యూల్ చేర్చడమే పరిష్కారం మార్గమని బీసీలను చైతన్యం చేయడం కోసం సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాము ఏ పార్టీ సంఘానికి అనుబంధం కాదని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. బీసీ రిజర్వేషన్ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. 15 తర్వాత అన్ని జిల్లాలలో బీసీ ఆక్రోశ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వా త జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని తెలిపారు. అనంతరం ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే ఆక్రోష మహాసభ కరప త్రాలను ఆవిష్కరించారు.