29-12-2025 01:44:38 AM
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, డిసెంబరు 28 (విజయ క్రాంతి): నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. క రీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ప్రజల భ ద్రత దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక ఆం క్షలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
కమిషనరేట్ వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేం ద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి వాహనాలను వెంటనే సీజ్ చేస్తామని తెలిపారు. ప్రతి పాయింట్ వద్ద 8-10 మంది సిబ్బంది బ్రెత్ అనలైజర్లు, బాడీ వార్న్ కెమెరాలతో విధుల్లో ఉంటారని తెలిపారు. డి సెంబర్ 31 రాత్రి కరీంనగర్ లోయర్ మా నేరు డ్యామ్ కట్ట, తీగల వంతెన పైకి వెళ్లడం, అక్కడ వేడుకలు నిర్వహించడం పూర్తిగా నిషేధించామన్నారు.
వేడుకల్లో డీజేల వినియోగంపై పూర్తి నిషేధం ఉందని, ధ్వని కాలుష్యానికి సంబంధించి ఫిర్యాదులు అం దితే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించవచ్చని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడం ని షిద్ధమని, ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నగర శివార్లలోని గెస్ట్ హౌస్లు, ఫాంహౌస్లపై ప్రత్యేక ని ఘా ఉంచామన్నారు. డ్రగ్స్ వాడకాన్ని గు ర్తించేందుకు నార్కో టీమ్స్, శిక్షణ పొందిన జాగిలాలు, డ్రగ్ డిటెక్ట్ కిట్లను ఉపయోగిస్తామని, పట్టుబడిన వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వేడుకల సమయంలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీమ్స్ నిరంత రం పర్యవేక్షిస్తాయని, ముఖ్య ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్, పికెట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకలు జరు పుకునే వారు తమతో పాటు ఇతరుల ప్రా ణాలకు ముప్పు కలిగించవద్దని, మద్యం మ త్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రా ణాలు తీయవద్దని, పోలీసులకు సహకరించి, ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని సీపీ గౌస్ ఆలం కోరారు.