09-07-2025 12:11:09 AM
రంగారెడ్డి జూలై 8( విజయ క్రాంతి ): కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంస్థాగతంగా పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తుంది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. దానిలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర స్పోరట్స్ చైర్మన్ శివసేనారెడ్డిని నియమించింది. శివసేన రెడ్డి నియమాకంపై రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
శివసేన రెడ్డి ఇన్చార్జిగా రావడంతో రంగారెడ్డి జిల్లా కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కడంతో పాటు, స్థానిక సంస్థలో ఆశావావులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.