11-11-2025 12:00:00 AM
ముంబై, నవంబర్ 11 : వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత మహిళల జట్టు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. వరల్డ్ కప్ విజయంతో మహిళల జట్టులో స్టార్ ప్లేయ ర్స్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. పురుషుల జట్టు తరహాలోనే మహిళా క్రికెటర్లతో ఒప్పందాల కోసం పలు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మహిళా క్రికెటర్లకు సున్నితంగా హెచ్చరికలు చేశారు.
కొన్ని కంపెనీలు తమ బ్రాండ్ వాల్యూ పెంచుకునేందుకు అబద్ధపు వాగ్ధానాలు చేస్తాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తమ పబ్లిసిటీ కోసం క్రికెటర్లతో ఒప్పందాలు చేసుకుంటామంటూ ముందే ప్రకటనలు చేసేస్తాయని, తీరా అవి అమల్లోకి రావని గుర్తు చేశారు. 1983లో ప్రపంచకప్ గెలిచినప్పుడు తమకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని చెప్పుకొచ్చా రు. చాంపియన్లను అభినందిస్తూ కొన్ని కంపెనీలు హోర్డింగ్స్ పెట్టి హడావుడి చేస్తాయని, అలాంటి వారి పట్ల అప్రమత్తం గా ఉండాలని సూచించారు.
కేవలం కొన్ని కం పెనీలు మాత్రమే ఆడిన మాట తప్పకుండా తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియ మించు కుంటాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వరల్డ్‌కప్ గెలవడంతో మహిళల జట్టు బ్రాం డ్ వాల్యూ పెరిగిందని, అందరూ ఆచితూచి వ్యవహరించాలని గవాస్కర్ సూచించారు. కాగా వరల్డ్ కప్ విజయం తర్వాత జెమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ వాల్యూ రూ.60 లక్షల నుం చి 1.5 కోట్లకు చేరిందని అంచనా. హర్మన్ ప్రీత్ కౌర్ బ్రాండ్ వాల్యూ రూ.2 కోట్లకు షె ఫాలీబ్రాండ్ వాల్యూ రూ.1 కోటి వరకూ చేరినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.