calender_icon.png 11 November, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిఛాఘోష్ పేరిట స్టేడియం

11-11-2025 12:00:00 AM

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటన

కోల్‌కత్తా, నవంబర్ 11 : సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిలల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. సెమీస్‌కు చేరడంపై అనుమానాలు నెలకొన్న వేళ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి సఫారీలను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన పలువురు క్రికెటర్లపై ప్రశంసల వర్షమే కాదు నజరానాలు, సత్కారాలు వెల్లువెత్తుతున్నా యి. తాజాగా భారత మహిళల జట్టు వికెట్ కీపర్ రిఛాఘోష్‌కు అరుదైన గౌరవం దక్కనుంది.

ఇటీవలే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఆమెకు గోల్డెన్ బ్యాట్, బాల్‌తో పాటు రూ.34 లక్షల నజరానా అందజేసిం ది. అప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రిఛాకు డీఎస్బీ ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. తాజాగా మమత మరో కీలక నిర్ణ యం తీసుకున్నారు.

రిఛాఘోష్ పేరు స్టేడియానికి పెడతామని చెప్పారు.డార్జిలింగ్‌లో 27 ఎకరాల ఖాళీ స్థలం ఉందని, అక్క డ స్టేడియం కట్టాలని మేయర్‌కు చెప్పినట్టు వెల్లడించారు. ఆ స్టేడియం నిర్మాణం పూర్తవగానే రిఛా క్రికెట్ స్టేడియంగా పేరు పెడతా మన్నారు. వరల్డ్‌కప్ విజేతగా ఆమె పేరు కలకాలం నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. రిఛా భవిష్యత్తులో మరిన్ని శిఖరా లు అధిరోహించాలని మమత ఆకాంక్షించారు.