29-08-2025 03:41:32 AM
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి ): రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీనదీ పరివాహక అభివృ ద్ధి జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల కు సూచించారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్‌పై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్‌ను అధికారులు రేవంత్‌రెడ్డికి వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పా టు చేయాలని ఆదేశించారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పర్యావరణహితంగా అభివృద్ధి ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు.
మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి, పనులు మొదలు పెట్టాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రా జ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ (హెఎండీఏ ఏరియా) ఇలంబర్తి, హె చ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్‌సీడీ ఏ కమిషనర్ కే శశాంక, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్ డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జేఎండీ పీగౌత మి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.