17-08-2025 12:35:50 AM
రిజర్వాయర్ల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి
పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలి
అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శా ఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాగులు, వంకలు పొంగే ప్ర మాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.
జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగ తా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు. నిజామాబాద్, సంగా రెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో శనివారం ఉదయం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆ ర్‌ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని సీఎం తెలిపారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటిక ప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమా చారం ఇవ్వాలన్నారు.
పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీ సులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షపు నీరు నిల్వ ఉండి దోమ లు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అం టువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరా లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వ హించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, వైద్యారోగ్య, పురపా లక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎం సీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.