calender_icon.png 17 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనందసాగరం.. కన్నయ్య జననం

17-08-2025 12:36:01 AM

- బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్‌లో ఘనంగా జన్మాష్టమి వేడుకలు

- భక్తులనుద్దేశించి ప్రవచించిన సత్యగౌర చంద్రబోస్ ప్రభూజీ

హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 16(విజయక్రాంతి): బంజారాహిల్స్‌లని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో శనివారం జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు రాధాగోవింద, గోదా కృష్ణ, లడ్డు గోపాల్ దర్శనాలు కల్పించారు. ప్రతిఒక్కరికి లడ్డుగోపాల్ ఊంజల (ఝులన్) సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. నగరంలోని భక్తులు పెద్దసంఖ్యలో హాజరై కృష్ణుడి అనుగ్రహం పొందారు. ఉదయం 4:30 గంటలకు షోడశోపచార సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

నంతరం రాధాగోవింద స్వామికి విశిష్ట పుష్పాలు, నూతన వస్త్రాలతో అలంకరించారు. ఉద యం 6 గంటలకు శృంగారారతితో దర్శనం ప్రారంభమైంది. ఈ సమయానికే లడ్డుగోపాల్ ఊంజల సేవ మొదలైంది. సర్వలోక శ్రేయస్సు కోసం ఉదయం సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. అనంతరం చప్పన్ భోగ్ (56 నైవేద్యాలు)ను సమర్పించారు. రాజభోగారతి, మధుర భజనలు, కీర్తనలతో దేవాలయం దైవనామస్మరణతో మార్మోగింది. ఉదయం, మధ్యాహ్నం, సా యంత్రం, అర్ధరాత్రి ఇలా మొత్తం నాలుగు సార్లు విశిష్ట అభిషేకాలు నిర్వహించారు.

వాటిలో ప్రధానమైన ‘విశేష 108 కలశ మహాభిషేకం’ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైంది. భారతదేశంలోని ఏడు పవిత్ర నదుల జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం హరేకృష్ణ మూ వ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఐఐటీ మద్రాస్, ఎంటెక్) ‘భగవాన్ శ్రీకృష్ణ అవతార మహిమ’పై చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం సాయం త్రం మహా మంగళారతి, ఊంజల సేవ, మధుర భజనలు, సంప్రదాయ నృత్యాలు చేశారు.

ఈ సందర్భంగా హరేకృష్ణ మూ మెంట్ కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రదర్శనలు హరేకృష్ణ చాలెంజ్, కృష్ణ కిడ్స్, జప క్లబ్, ఐక్య విద్య, ఫోక్ యూత్ బోధన లు, తీర్థయాత్ర, హరేకృష్ణ వాణి మొదలైనవి ఏర్పాటు ఆకట్టుకున్నాయి. బంజారాహిల్స్‌లోని ప్రధాన ఉత్సవాలతో పాటు, నార్సింగి, కోకాపేట్‌లో నిర్మాణంలో ఉన్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్లలోనూ రాధాకృష్ణ దర్శనం, లడ్డుగోపాల్ ఊంజల సేవ భక్తులను ఆకట్టుకుంది. మరోవైపు బేసిల్ ఉడ్స్ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అంద ర్నీ ఆకర్షించాయి. సంగారెడ్డి, కందిలోని హరేకృష్ణ కల్చరల్ సెంటర్‌లోనూ ఉత్సవాలు జరిగాయి. ఆదివారం నందోత్సవం సందర్భంగా ప్రత్యేక నైవేద్యాలు, హరినామ సంకీర్తన, ఊంజల సేవలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు.