calender_icon.png 24 September, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

24-09-2025 12:00:00 AM

-రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలి

-డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్

-అంకోలి పీహెచ్‌సీలో విస్తృత తనిఖీలు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాం తి):  జిల్లాలో స్వస్థ నారి  స్వసక్త పరివార్ అభియాన్, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు సక్ర మంగా అమలుఅయ్యేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తో కకిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉన్న అన్ని గదులను పరిశీలించారు.  ల్యాబ్‌లో ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు... రోజుకు ఎంత మందికి రక్త పరీక్షలు చేస్తున్నారని అరా తీశారు. ఫార్మసి కి సంబంధించిన ఎన్ని రకాల మందులు మీకు అందుబాటులో ఉన్నాయి. రోగులకు అన్ని రకాల మం దులు సరిపోతున్నాయా అనే అంశాలను ఫార్మసిస్టుని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఫీల్ లో ఎలాంటి సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో ప్రసూ తి వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో అమలులో ఉన్న అన్ని ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించి, సీజనల్ వ్యాధులపై అప్ర మత్తం గా ఉండాలని సిబ్బందికి సూచించా రు. పి.హెచ్.సిలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ సాధన, జిల్లా మలేరియా నివారణ అధికారి, ఎన్సిడి అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లివార్, అంకోలి వైద్యాధికారి, వైద్య సిబ్బం ది పాల్గొన్నారు.