24-09-2025 12:00:00 AM
బేజాడి కుమార్ డిమాండ్
ఆలేరు, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : 2017 నుండి ప్రజల సొమ్ముని జి ఎస్ టి పేరుతో దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల జి ఎస్ టి లో మార్పులు చేసింది, సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి తెచ్చిన నూతన జీఎస్టీ విధానం ప్రకారం, కిరాణా దుకాణాల్లో నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ బేజాడి కుమార్ డిమాండ్ చేశారు.
లేని పక్షంలో, పి.వై.ఎల్. తరపున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మరుజొడు సిద్దేశ్వర్, కార్యదర్శి సాదుల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఎలగందుల సిద్దులు ,చెకిలంవెంకటేష్, సహాయ కార్యదర్శి వడ్లకొండ నాగరాజు, చిరబోయిన బాలకృష్ణ, జిల్లా నాయకులు కుండే బీరయ్య, చెకిలం కుమారస్వామి, దడిగే కృష్ణ, ఆకుల కృష్ణ, నరసింహ పాల్గొన్నారు.