23-09-2025 11:46:08 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలో మంగళవారం 109 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలోని ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.