31-01-2026 01:58:56 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ జనవరి 30(విజయక్రాంతి): రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో నిర్వహించనున్న గంగాపూర్ జాతర సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తతతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ సూచించారు. ఈ సందర్భంగా గంగాపూర్లో ప్రత్యేక డ్యూటీ బ్రీఫింగ్ నిర్వహించిన ఎస్పీ, ట్రాఫిక్ నియంత్రణ, ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెంచి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. జాతర సందర్భంగా 282 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ వాహీదుద్దీన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్త్స్ర వెంకటకృష్ణ, వాంకిడి సీఐ సత్యనారాయణ, ఆర్‌ఐ అంజన్న, తీర్యాని ఎస్సై వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.