31-01-2026 01:57:30 AM
నిర్మల్, జనవరి 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలను సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర మాజీ మంత్రి అన్నారు. శుక్రవారం నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు ప్రజల కోసం కష్టపడి పని చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వెలుగు సుధాకర్ ధర్మాజీ రాజేందర్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు.