31-01-2026 02:00:27 AM
కలెక్టర్ కె.హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టి కల్, వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు 15 కేంద్రాల్లో జరగనున్నాయని, వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 19 కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు.
జనక్కాపూర్ జిల్లా పరి షత్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాజరు శా తం పెంచి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టరేట్ లో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, బాలికలను రక్షించి చదివించి ఎదుగునివ్వాలని పిలు పునిచ్చారు. అలాగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో మీడియా సెంటర్, మీడి యా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను కలెక్టర్ ప్రారంభించారు.