calender_icon.png 7 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ బీజాల సుందర శిల్పాలు!

05-01-2026 01:49:14 AM

  1. గిరిజన సంప్రదాయాలతో సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం
  2. కనీవినీ ఎరుగని రీతిలో జాతర నిర్వహిస్తాం
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  4. మంత్రి సీతక్కతో కలిసి పనుల పరిశీలన

ములుగు, జనవరి 4 (విజయక్రాంతి): ఆదివాసీ బీజాల సుందర శిల్పాలతో మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు శాశ్వత చిరునామగా నిలుస్తుందని, చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ప్రజా ప్రభుత్వం మేడారం జాతరను నిర్వహించడానికి సంకల్పించుకుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో  పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టి.ఎస్‌లతో కలిసి ప్రాంగణ ల్యాండ్ స్కేపింగ్ పనులను, ప్రధాన ఆర్చి నిర్మాణ పనులు, హరిత హోటల్ జంక్షన్ సుందరీకరణ, రహదారి నిర్మాణ పనులను, జంపన్న వాగు స్నాన ఘట్టాలను, లెవెలింగ్ పనులను నీటి నిల్వ కోసం ఏర్పాటు చేస్తున్న ఆనకట్టల నిర్మాణ పనులను పరిశీలించారు.

జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి బ్యాంబు చికెన్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇలాంటివి ఇంకా 10బాంబ్ చికెన్‌షాపులను మేడా రం పరిధిలో ప్రారంభం కానున్నాయి. ఈసారి మేడారం జాతరలో 485 షాప్స్, 84 జాతర దారిలో ప్రారంభం కానున్నాయి. అనంతరం ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి మేడారంలోని హరిత హోటల్‌లో మంత్రులు పనుల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ ప్రాకా రం పిటి బీమ్స్ అమరికా పనులను, గద్దెల రాతి స్తంభాలపై బ్రాకెట్‌లను త్వరగా ఏర్పాటు చేయాలని, ఆలయ ప్రాంగణ, జాతర సివిల్ వర్క్స్, క్యూ లైన్స్ షేడ్స్ నిర్మాణం మొత్తం జనవరి 12వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశిం చారు. నూతనంగా నిర్మించిన రహదారులకు ఇరువైపులా సైడ్ బర్ములను ఏర్పాటు చేయాలని పబ్లిక్ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి చూస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మేడారం ప్రాంతం సంక్రాంతి పండుగ  ముందు నుంచి జనవరి 31వరకు విద్యుత్ కాంతుల వెలుగులతో భక్తులకు కనిపించాలని వాటికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబధిత అధికారులకు సూచించారు. మంత్రి సీతక్క ఇక్కడే ఉండి పునరుద్ధర ణ పనులను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నారు. ఈనెల 20లోగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి రాత్రి బస చేసి తెల్లవారి ఉదయం ప్రారంభిస్తారని చెప్పారు. మంత్రుల వెంట ఎస్పీలు శబరిష్, సిరిశెట్టి సంకీర్త్, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా ఉన్నారు.