22-08-2025 01:18:32 AM
తుర్కయంజాల్, ఆగస్టు 21:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లిలో శ్రీశ్రీశ్రీ బీరప్ప, మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించారు. కురుమ కులస్థుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో బోనాల జా తర వైభవంగా సాగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పెద్దకురుమ గొరిగె భాషయ్య, షెల్వోజీ శంకరయ్య, బీరప్పగుడి చైర్మన్ కొండ్రు జంగయ్య, గుడి పాలకవర్గ సభ్యులు, రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ కొండ్రు స్వప్న శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కొండ్రు మల్లేశ్, అయిలయ్య, శ్రీశైలం, సిద్దాల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.