22-08-2025 01:20:33 AM
కీసర, ఆగస్ట్ 21: కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ 6వ వార్డ్ న్యూ కుందనపల్లి లోని కేఎస్‌ఆర్ టౌన్ షిప్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్బంగా అధ్యక్షుడిగా పసుపులేటి ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా వెంకట్ రామ్ రెడ్డి, కోశాధికారిగా సుబుంకర్ పవన్ తో పాటు మొత్తం 21 మంది సభ్యులతో కొత్త కమిటీ ఏర్పడనుంది. ఈ కమిటీ 2025-27 రెండు సంవత్సరాల కాలపరిమితి వరకు కాలనీ అభివృద్ధి కోసం కృషి చేయనుంది.
ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారి ఎమ్.ఎస్ చారీ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పసుపులేటి ప్రతాప్ మాట్లాడుతూ కమిటీపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కాలనీవాసులకు కృతజ్ఞతలు.
రాబోయే రెండు సంవత్సరాల పాటు కేఎస్‌ఆర్ టౌన్షిప్ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. మౌలిక వసతుల సమస్యలు, రోడ్లు, పారిశుధ్యం, పార్కులు, భద్రతా సౌకర్యాలు వంటి అంశాలను ముఖ్యంగా పట్టించుకుంటాం అని తెలిపారు.ఈ సందర్బంగా కాలనీవాసులు నూతన కమిటీ ఎన్నికలను హర్షాతిరేకాలతో స్వాగతించారు.