calender_icon.png 22 August, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం

22-08-2025 01:17:10 AM

  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

మండలంలో కుర్మిద్ద, తాటిపర్తి, గ్రామాలలో రూ. 11 కోట్లతో అభివృద్ధి పనులు 

యాచారం , ఆగస్టు 21:గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కుర్మిద్ద, తాడిపర్తి, గ్రామాలలో 11 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికంగా నిధులను వెచ్చించి.. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.

ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. అలాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తున్నామన్నారు.అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేసి.. సన్నబియ్యం పంపిణీ వస్తున్నామన్నారు. రైతు ఋణ మాఫీ అందించామని తెలిపారు. మహిళల కు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి..

వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు , బిలకంటి శేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.