calender_icon.png 10 November, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో జోరుగా బెల్టుషాపులు

10-11-2025 12:00:00 AM

-బెజ్జెంకి మండలంలో జోరుగా బెల్ట్ షాపుల దందా

- పేరుకే కిరాణం.. విక్రయించేది మధ్యమే

- పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్న మద్యం 

బెజ్జంకి, నవంబర్ 9:పల్లెలు మారుమూ ల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రా మాలలో పుట్టగొడుగుల్ల బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తూ వ్యాపారం 3 పూలు, 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. నిబంధనలకు విరు ద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేక మంది మద్యానికి అలవాటు పడి అప్పులు చేసి కు టుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇదంతా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో సహా గ్రామాల్లో కొనసాగుతుంది. బెజ్జంకి మండల కేంద్రంలో అనుమతి పొందినవి 2 వైన్ షాపులు ఉంటే గ్రామాల్లో అనేక బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. ఈ రెండు మద్యం దుకాణాల నుంచే బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తున్నారు. 

అధికారులు ‘మామూలొల్లే‘... 

మద్యం కావాలనుకున్న సమయానికి బెల్ట్ షాపుల ద్వారా లభించడంతో విద్యార్థులు, యువకులు, కుటుంబ యజమా నులు సమయపాలన లేకుండా మద్యం సేవిస్తున్నారు. గతంలో ఈ మండల పరిధిలోని పలు గ్రామాలలో గుడుంబా తయారు చేసే వారు అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించి నామరూపాలు లేకుండా చేసిన పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు బెల్ట్ షాపుల నిర్వహణకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల నిర్వాహకులు బెల్ట్ షాపులకు విగ్ర హించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి అధిక మొత్తంలో కొనుగోలు చేయ డంతో పాటు అధిక ధర చెల్లించడం ప్రధానమైన కారణంగా తెలుస్తుంది.

వైన్ షాప్ లలో కంటే బెల్ట్ షాపులలోనే అన్ని రకాల బ్రాండ్లు లభిస్తున్నాయని మద్యం ప్రియులు బెల్ట్ షాపులని ఆశ్రయిస్తున్నారు. క్వార్టర్ బాటిల్ పై రూ.20 అధిక ధరకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారు. మొదట ఎమ్మార్పీ పై రూ.5 అదనంగా అమ్మిన వైన్ షాప్ ల నిర్వాహకులు, ఇప్పుడేమో ఏకంగా క్వార్టర్ బాటిల్ పై రూ.20 అదనంగా బెల్ట్ షాపు నిర్వాహకుల వద్ద వసూలు చేస్తున్నారని వినికిడి. బెల్ట్ షాపుల నిర్వాహకులు మరో రూ.20 చూసుకొని కస్టమర్లకు ఇస్తున్నారు. వైన్ షాపుకు వచ్చిన కస్టమర్లకు మాత్రం అడిగిన బ్రాండ్ లేదని, ఇతర బ్రాండ్లకు చెం దిన సీసాలను అంటగడుతున్నారనీ మద్యం ప్రియులు వాపోతున్నారు. ఇదంతా పోలీసు శాఖ ఎక్సైజ్ శాఖల అధికారుల కనుసన్నల్లో కొనసాగుతుందని, మామూళ్ల మత్తుకు అలవాటు పడిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు మండిపడుతున్నారు. 

పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు..

మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్ట్ షాపులు పుట్టగొ డుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీంతో పొద్దం తా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి బానిసై కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహిస్తుండడంతో యువత పెడదారి పడుతున్నారు. పేరుకే కిరాణం.. కానీ విక్రయి స్తున్నది మాత్రం మధ్యమే.

అనేక మంది కిరణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మా త్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొంత మంది సొంత ఇళ్లలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తు న్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుందనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబం ధిత అధికారులు స్పందించి నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.