17-05-2025 07:45:47 PM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి విఆర్ఆర్ వరప్రసాద్..
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో జూన్ నెల 14వ తారీకున జరగబోయే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి విఆర్ఆర్ వరప్రసాద్ తెలిపారు. శనివారం కామారెడ్డి కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయమూర్తులు కృషి చేయాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ మొత్తంలో కేసులను పరిష్కరించాలని అన్నారు.
లోక్ అదాలత్ లో ఎక్కువ కేసుల పరిష్కారానికై పోలీస్ శాఖ మరింత కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కొన్ని లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికై కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, పబ్లిక్ ప్రోసెసిక్యూటర్స్ రాజ్ గోపాల్ గౌడ్, సూర్యప్రసాద్, అశోక్, నిమ్మ దామోదర్ రెడ్డి, S.I లు, కానిస్టేబుల్ లు పాల్గొన్నారు. కక్షిదారులు జూన్ 14న జరిగబోయే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.