calender_icon.png 18 May, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి..

17-05-2025 08:01:33 PM

జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు..

సూర్యాపేట (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని నిర్వాహకులకి జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు(District Additional Collector P Rambabu) సూచించారు. శనివారం జిల్లాలోని పెన్ పహాడ్ మండలం అనాజీపురం ఐకెపి, పిఏసిఎస్ అనంతారంల, మోతే మండలం రావిపహాడ్, శ్రీ ఆంజనేయ ఎంఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే భీక్యాతండా, ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యం తూర్పాల పోసి శుభ్రపర్చిన తదుపరి కాంటా వేయాలని తెలిపారు.

లోడ్ వేయటానికి సరిపోను బస్తాలు కాంటా వేయగానే లారీలను రప్పించుకోవాలనీ కాంటా వేయకముందే లారీలను పిలిపిస్తే లారీలు వెయిటింగ్ చేయాల్సి వస్తుందన్నారు. రికార్డులు పరిశీలించి ఇప్పటి వరకు అనాజీపురం నుంచి 11892.64 క్వింటాలు, అనంతారం నుండి 12247.60 క్వింటాలు, రావిపహాడ్ నుండి 5900 క్వింటాల ధాన్యం, భీక్యతండా నుండి  9870 క్వింటాలు, తుమ్మల పెన్ పహాడ్ 19000 క్వింటాల ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకి తరలించటం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రంలాలో రైతులను ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. రాత్రి అనుకోకుండా వర్షాలు కురుస్తునందున వడ్లపై టార్పాలిన్ కప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ తహసీల్దార్ లాలు, మోతే డి టి లావణ్య, ఎ ఓ అరుణ, ఎ పి యంలు వెంకయ్య, అజయ్,ఏ ఈ ఓ ఝాన్సీ,సెంటర్ ఇంచార్జిలు ధనలక్ష్మి, లక్ష్మారెడ్డి, రామకృష్ణ, పద్మ, యమున, సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.