calender_icon.png 17 August, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఐ సాయికృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం

16-08-2025 12:45:55 AM

చిగురుమామిడి, ఆగస్టు 15(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎస్త్స్ర ఆర్ సాయి కృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 79 వ స్వా తంత్ర దినోత్సవ వేడుకలకు పురస్కరించు కొని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో కరీంనగర్ లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పురస్కారాన్ని శుక్రవారం ప్రదానం చేశారు. ఎస్త్స్ర సాయి కృష్ణ పదవీ బాధ్యతలు చేప ట్టినప్పటి నుండి విధి నిర్వహణలో అంకి తభావంతో అనేక నేరాలను చేదించారు. వీరికి సేవా పురస్కారాన్ని అందించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.