13-05-2025 01:07:55 AM
డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, మే 12 (విజయక్రాంతి): స్వంత భవనాలు అత్యాధునిక సాంకేతికత వినియోగించడం ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సేవలను సత్వరమే అందించవచ్చని డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని కల్లూరు రోడ్లో ఎస్సారెస్పీ క్యాంపు స్థలంలో నూతనంగా నిర్మించిన బ్యాంకు భవనాన్ని వారు ప్రారంభించారు.
అలాగే కోరుట్ల మండలంలోని సర్పరాజుపల్లి (మాదాపూర్), పైడిమడుగు, జోగిన్పల్లి గ్రామల్లో నూతనంగా నిర్మించిన ప్యాక్స్ గోదాములను కూడా వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకే నూతన నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.
అర్హులైన రైతులందరూ ఈ సేవలను ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలని వారు కోరారు.కోరుట్ల విండో చైర్మన్ ఎలిశెట్టి భూమిరెడ్డి, డైరెక్టర్లు, బ్యాంకు, ప్యాక్స్ అధికారులు, ఆయా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.