13-05-2025 01:08:57 AM
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్, మే 12 (విజయక్రాంతి): గ్రంథాలయాలలో మరిన్ని వసతులు కల్పిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం బోధన్ పట్టణంలోని గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు.
విద్యార్థుల, పాఠకుల సౌకర్యార్ధం నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన 5కంప్యూటర్ లతో కూడిన డిజిటల్ లైబ్రరీ ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో గ్రంథాలయాలను ఆధునికరుస్తున్నామని విద్యార్థులు,పాఠకులు సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశవేణు, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పాషా, నాగేశ్వర్ రావు, దాము, నవీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.