27-08-2025 12:00:00 AM
అడ్డుకున్న శేరిగూడ గ్రామస్తులు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26: దశాబ్దల చరిత్ర కలిగిన కాలువలను, కుంటలను ఏది వదలకుండా అక్రమార్కులు చెరబ డుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధి శేరిగూడ గ్రామంలోని శ్రీ దత్త ఇంజ నీరింగ్ కళాశాల యజమాన్యం కాలేజీ పక్కన ఉన్న కాల్వను ఆక్రమించి చదును చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ... తాత ముత్తాతల నాటి కాలువను, దీనికి అనుకుని ఉన్న రోడ్డును శ్రీ దత్త కళాశాల యాజమాన్యం అక్రమంగా ఆక్రమించి, ఈ రోడ్డులో అర్ధరాత్రి బోర్ సైతం వేశారని ఆరోపించా రు.
33 ఫీట్ల వెడల్పుతో ఉన్న కాలువ ప్రస్తుతం 5 ఫీట్లకు కుంచించుకు పోయిం దన్నారు. అదేవిధంగా దీనికి అనుకొని ఉన్న రోడ్డుపై నుంచి బావుల వద్దకు వెళ్లే వారు, పశువుల, గొర్రెల కాపర్లు ఇదే దారి లో యేండ్ల నాటి నుంచి వెళ్లేవారని గ్రామ స్తులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులకు గ్రామస్తులు సమా చారం ఇవ్వగా ఇరిగేషన్ ఫీల్ ఇన్స్పె క్టర్ సాయి కుమార్ గౌడ్ అక్కడకు చేరుకొని స్థలాన్ని పరిశీలించి కాలేజీ యాజమాన్యం చేస్తున్న పనిని నిలిపివేశారు. ఇదే విషయ మై ఇరిగేషన్ డిఈ చెన్నకేశవ రెడ్డిని వివర ణ కోరగా రెండు మూడు రోజులలో మం డల సర్వేయర్‌తో సర్వే నిర్వహి స్తామని, ఆక్రమణకు గురైనట్లు తేలితే తగిన చర్యలు తీసుకుం టామని అయన పేర్కొన్నారు.