23-11-2025 12:00:00 AM
క్యాన్సర్ అనేది ఇప్పటి మాట కాదు. సంప్రదాయపరంగా వస్తున్న ఈ మహమ్మారి ప్రపంచంలో ఎందరో ప్రాణాలను కబలించేస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకా రం 2025 నాటికి 20 మిలియన్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారు. దాదాపు ఒక మిలియన్ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లుకేమి యా, రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తాయి.
కానీ మారుతున్న జీవనశైలికి తోడు తీసుకునే ఆహారం వరకు అన్ని కలుషితమవుతున్న తరుణంలో క్యాన్సర్ తన రూపును మార్చుకుంటూ కొత్త రకంలో మానవ శరీరంపై విరుచుకుపడుతుంది. సాధారణంగా వృద్ధుల్లో, వయసు మీద పడిన వారిలో ఎక్కు వగా కనిపించే పెద్దప్రేగు క్యాన్సర్ ఇటీవలి కాలంలో యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, వ్యాయామం చేయ కపోవడం, అధిక బరువు ఉండడం ప్రధాన కారణాలైతే..
ఆహారపు అలవాట్లలో భాగంగా ఫైబర్ తక్కువగా ఉండే, ప్రాసెస్ చేసిన మాంసాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంతో పాటు ధూమపానం, మద్యపానం తీసుకోవడం వల్ల ఈ రకం క్యాన్సర్ సంభవిస్తుంది. 1950లో పుట్టిన వాళ్ల కంటే 1990 తర్వాత పుట్టిన వారిలో పెద్దప్రేగు క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలున్నట్లు ఒక నివేదికలో వెల్లడైంది. ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న మరొకటి కడుపు క్యాన్సర్. వైద్య పరిభాషలో దీనినే గ్యాస్ట్రిక్ క్యా న్సర్ అని పిలుస్తారు.
జీర్ణాశయం లోపలి పొరలో క్యాన్సర్ కణుతులు, డీఎన్‌ఏలో మార్పుల కారణంగా అసాధారణ కణతులు పెరగడం వల్ల కడుపు క్యాన్సర్ మొదలవుతుంది. కొంచెం తినగానే కడుపు ఉబ్బిపోవడం, అజీర్ణం, గుండెల్లో మంట వంటి లక్షణాలు కడుపు క్యాన్సర్‌కు సంకేతాలు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు మధ్యలో ఎవరికైనా వచ్చే అవకాశమున్నది. కొత్త కణాలు పుట్టుక, పని తర్వాత అవి నశించడం, మళ్లీ కొత్త కణాలు పుట్టకురావడం మన శరీరంలో జరిగే నిరంతరం ప్రక్రియ.
ఒకవేళ, కార్సినోజెన్ ఎక్స్‌పోజర్, ఇన్‌ఫెక్షన్, వైరల్ ఇన్‌ఫెక్షన్, వంశపారపర్యం వల్ల కణా లపై మ్యుటేషన్ జరిగితే శరీరంపై నియంత్రణ కోల్పోతాం. కణా లు అనియంత్రిత స్థాయిలో పెరుగుతాయి. వాటి పరిమాణం, సహజత్వం లో మార్పులు సంభవించడాన్నే క్యాన్సర్ అని పిలుస్తున్నాం. అమెరికా, చైనా వంటి దేశాల్లో క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంటే.. భారత్‌లో మాత్రం కేసుల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండడం ఆందోళనకరం.
1990లో ప్రతి లక్ష మందిలో 84 మంది క్యాన్సర్ బారిన పడుతుండగా 2024 నాటికి 107 మందికి పెరిగినట్లు ఇటీవలే ది లాన్సట్ జర్నల్‌లో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) స్టడీ క్యాన్సర్ లేబొరేటరీ నివేది కలో బయటపడింది. దేశవ్యాప్తంగా 33 ఏండ్లలో 26 శాతం కేసులు పెరిగితే.. మరణాలు 21 శాతం పెరిగాయి. ఇక తెలంగాణలో క్యాన్సర్ కేసులు అధికంగా పెరుగుతున్నాయి.
2020లో తెలంగాణలో క్యాన్సర్ ఇన్ పేషేం ట్ల సంఖ్య 15,292 ఉండే .. 2025 వచ్చేసరికి ఆ సంఖ్య 38, 513కు పెరగడం గమనార్హం. చాలా రకాల క్యాన్సర్లకు ఇప్పటికీ సరైన చికిత్స లేకపో వడంతో ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవన విధానం ఒక్కటే మార్గమని గ్రహించాలి.