calender_icon.png 5 December, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలి

05-12-2025 12:22:22 AM

మహబూబాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల అప్ర మత్తంగా ఉండాలని మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీ పాణిని హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ ఈ మధ్య కాలం లో సమాజంలో ఎక్కువగా విద్యార్దులు, గృ హిణులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఎ క్కువగా ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని అట్టి నేరాలపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆన్లై న్, డిజిటల్ అరెస్టులు ఉండవని చెప్పారు.

ఇంట్లో తల్లి తండ్రులకు, పెద్దలకు కూడా ఇట్టి నేరాలపట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్య త విద్యార్దులపై ఉందని చెప్పారు. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి, స్థానిక పోలీస్ వారికి పిర్యాదు చెయ్యాలని చెప్పా రు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్ధులు, సైబర్ క్రైమ్స్ ఎస్త్స్ర కరుణాకర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.