05-12-2025 12:23:30 AM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారు లు సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కల్పించాలని ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలె క్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఎన్నికల సాధారణ పరిశీలకులు మధుకర్ బాబుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ తొలి విడత ఎన్నికల నిర్వహణపై అన్ని అంశాలపై సమీక్షించారు.
తొలి విడత జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు డిసెంబర్ 8న, రెండో విడత 12న, మూడో విడత 15న ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, ఆర్డీవో కృష్ణవేణి, డిపిఓ హరిప్రసాద్, సిపిఓ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.