10-05-2025 12:00:00 AM
బ్యాంకులకు జాబితాను పంపాలి
29వ తేదీలోగా జిల్లా మీటింగ్ ఏర్పాటు
గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష
ఆదిలాబాద్, మే 9 (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణా ల కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతి, యువకుల హార్డ్ కాపీలను పరిశీలించి బ్యాంకులకు జాబితా ను పంపాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సం బందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారంగూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధి కారులతో పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు లబ్ధిదారులకు వేగంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సేవలను అందించాలన్నారు. ఈ నెల 12 వరకు డెస్క్, బ్యాంక్ లెవెల్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని, 13వ తేది నుండి 19వ తేదీ వరకు మండల్ లెవెల్ సమావేశాలు నిర్వహించుకోవాలని, అనంతరం కార్పోరేషన్ల వారీగా రెడీ చేసి 26వ తేది వరకు పూర్తి జిల్లా లెవెల్ లో వెరిఫికేషన్ చేసుకొని 29వ తేదీలోగా జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు మొత్తం 48,175 రాగా అందులో 38,911 వెరిఫికేషన్ చేసి ఎక్సెల్ షీట్‌లో బ్యాంకులకు పంపించడం జరిగిందనీ, మిగి తా 27,496 వెరిఫికేషన్ చేసి బ్యాంకులకు పంపించడం జరుగుతుందని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.
మండల్, గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తుల లిస్టును పారదర్శకంగా ఎంపిక చేయాలని తెలిపారు. గూగుల్ మీట్‌లో ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా, డీఆర్డిఓ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఆల్ మేజర్ బ్యాంక్స్, ఎంపీడీవోలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.