calender_icon.png 9 July, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ వివాదంలో భద్రాచలం దేవస్థానం ఈఓపై దాడి

08-07-2025 07:25:32 PM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి (EO) ఎల్.రమాదేవిపై గ్రమస్తులు మంగళవారం దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించి 889.5 ఎకరాల భూములు ఉన్నాయి. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయబడింది. ఆ భూముల్లో ఆక్రమణలను తొలగించి ఆలయానికి తిరిగి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించినప్పటికీ, అక్రమ నిర్మాణాలు ఆ తీర్పును ధిక్కరిస్తూనే ఉన్నాయి.

వివాదాస్పద భూమి(Disputed Land)ని పరిశీలించడానికి, కొనసాగుతున్న ఉల్లంఘనలను పరిష్కరించడానికి రమాదేవి పురుషోత్తపట్నం గ్రామాన్ని(Purushottapatnam Village) సందర్శించారు. ఆలయ భూములకు సంబంధించి దేవస్థానానికి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయని, నిర్మాణాలు చేపట్టవద్దని అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోతో పాటు ఆలయ సిబ్బందిపై ఆక్రమణదారులు కర్రలతో దాడికి పాల్పడడంతో  సందర్శన హింసాత్మకంగా మారింది.

ఈ నేపథ్యంలో స్పృహ కోల్పోయిన ఆమెను, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వినిల్(Outsourcing Employee Vinil) అస్వస్థతకు గురికావడంతో ఆలయ సిబ్బంది ఇద్దరిని భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్లిద్దరు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆలయ ఈవో రమాదేవిపై దాడిని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. దేవస్థాన భూముల ఆక్రమణలపై అడిగేందుకు వెళ్లినవారిపై దాడి చేయడం సరికాదని, ఈ దాడికి పాల్పడిన వారిపే వెంటనే పోలీసులు కఠినం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెల్లం కోరారు.