22-08-2025 01:52:25 AM
భద్రాద్రి కొత్తగూడెం , ఆగస్టు 21 , (విజయ క్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం ప్రెస్ క్లబ్ నిర్వహణ కమిటీ ఏర్పాటు అయింది. కొత్తగూడెం పట్టణంలోని యుటిఎఫ్ భవనంలో ప్రింట్ మీడియా జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటు అవశ్యకత పై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం ప్రెస్ క్లబ్ కొనసాగించేలా ప్రింట్ అండ్ ఎలక్రానిక్ మీడియా ప్రతినిధులతో ప్రెస్ క్లబ్ కార్యనిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ప్రెస్ క్లబ్ ఏర్పాటు పై ఇష్టాగోష్టి చర్చలు నడిచినా అనంతరం అందరి అభిప్రాయాలను సేకరించారు. చివరగా అందరి ఏకాభిప్రాయం మేరకు ప్రెస్ క్లబ్ కార్యనిర్వహణకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో గౌరవ సహలాదారుడిగా సీనియర్ జర్నలిస్ట్ లోగాని శ్రీనివాస్,నిర్వాహణ కమిటీ సభ్యులుగా ఇమ్మంది ఉదయ్ కుమార్, పోతు రాజేందర్, బి శంకర్, దాసరి వెంకటేశ్వరరావు( డివి), మంద రాజేష్ కుమార్, ఎర్ర నాగీశ్వర్ (ఈశ్వర్)లను ఎంపిక చేసుశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రెస్ క్లబ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ప్రెస్ క్లబ్ సభ్యత నమోదు, ప్రెస్ క్లబ్ నిర్వహణ, ప్రెస్ మీట్లు, రిపోర్టర్ల సంక్షేమంతో పాటు కార్యాచరణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రెస్ క్లబ్ నిర్వహణకు అధ్యయనం చేసి నేటి పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలను రూపొంచడం జరుగుతుంది అన్నారు.
ప్రస్తుతానికి జిల్లా కోర్టు సమీపంలోని ప్రెస్ క్లబ్ ను తక్షణమే పునరుద్ధరించి కమిటీ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశాలు జరిగెల చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు వెల్లడించారు. స్టాఫ్డ్ రిపోర్టర్లు సతీష్, కృష్ణ గోవింద్, కాగితపు వెంకటేశ్వర్లు, అప్పడి లక్ష్మణ్, హెచ్ సత్యనారాయణ(సతీష్), అశోక్, అరుణ్ కుమార్, జి వి నరసింహారావు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, బాధ్యులు, రెడ్డిమల్ల నవీన్, తలారి రవి కుమార్,శివకుమార్, సీనియర్ రీపోర్టర్లు , మోటమర్రి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.