22-08-2025 01:54:05 AM
బీఆర్‌ఎస్ భద్రాచలం మండల విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
భద్రాచలం (విజయ క్రాంతి) భారత రా ష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు సె ప్టెంబర్ మొదటి వారంలో భద్రాచలంలో ప ర్యటించనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు తెలిపారు. కావున కేటీఆర్ పర్యటన, సభను జ యప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాం తారావు పిలుపునిచ్చారు..
గురువారం స్థానిక హరిత హోటల్ నందు భద్రాచలం మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కు మార్ అధ్యక్షతన మండల పార్టీ విస్తృత స్థా యి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడుతూ భద్రాచలం లో ఏ ఎన్నిక జరిగిన గులాబీ జెండా ఎగరాలని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా కార్యకర్తలు ముందుకు సాగాలని అన్నా రు.
తెలంగాణలో ప్రతి పల్లెల్లో మళ్లీ కెసిఆర్ గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి గులాబీ జెండా రాష్ట్రంలో అధికారం చేయబడుతుందని ఆశించారు. కేటీఆర్ గారి పర్యటన సంద ర్భంగా భద్రాచలం గులాబీ మయం అవ్వాలని అన్నారు, సమిష్టి నిర్ణయాలతో ఐక్యంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లి భద్రాచలం మండలంలో అన్ని వార్డులలో కమిటీలు వే యాలని కోరారు.
ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మాజీ నియోజకవర్గ ఇన్చార్జి మానే రామకృష్ణ, సీనియర్ నాయకులు తాండ్ర వెంకట రామారావు, నియోజవర్గ నాయకులు మాజీ వ్యవసాయ మార్కెట్ క మిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, మం డల పార్టీ కో,కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శు లు కావూరి సీతామహాలక్ష్మి,పూజల లక్ష్మి,
సీనియర్ నాయకులు కోటగిరి ప్రబోధ్ కు మార్, కొల్లం జయ ప్రేమ కుమార్, కోలా రాజు, మండల పార్టీ అనుబంధ రంగాల అధ్యక్ష కార్యదర్శులు సీనియర్ నాయకులు విద్యార్థి యువజన ఆటోయూనియన్ రంగా ల నాయకులు పాల్గొన్నారు..