calender_icon.png 22 August, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలు చేయాలి

22-08-2025 01:49:59 AM

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ములకలపల్లి, 21( విజయక్రాంతి): విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలు చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయక జ్ఞానం అందించాలనే లక్ష్యంతో ఇన్స్పైర్, ఇగ్నైట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో హైదరాబాద్ నుండి వచ్చిన మోటివేషన్ స్పీకర్లతో విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా స్ఫూర్తి కరమైన ప్రసంగాలను అందిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ములకలపల్లిలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల, జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కమలాపురం ఆశ్రమ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులుపెద్ద కలలుకని వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయాలని చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను అలవరచుకుంటే అవి జీవితాన్ని మార్చేస్తాయని పేర్కొన్నారు.

మోటివేషన్ స్పీకర్ల కృషిని ప్రత్యేకంగా అభినందించిన ఆయన ఈ కార్యక్రమం జరిగేందుకు సహకారం అందించిన కె. లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గన్యా నాయక్, ఎంపీడీవో ఎస్ వి సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆయా పాఠశాలల,కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.