02-12-2025 01:46:36 AM
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): భగవద్గీత జయంతి సందర్భంగా సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ చైర్మన్ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి రచించిన భగవద్గీత శ్లోక అండ్ తాత్పర్య (ఎసెన్స్) పుస్తకాన్ని కొండాపూర్ హనుమాన్‌నగర్‌లోని శారద హైస్కూల్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నందా, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ఐపీఎస్ (రిటైర్డ్) వి.వి. లక్ష్మీనారాయణ స్వామి ఆవిష్కరిం చారు.
భగవద్గీతను ధార్మిక గ్రంథం కాదు, జీవ న పథాన్ని చూపించే విశ్వవ్యాప్త జ్ఞాన గ్రం థంగా జస్టిస్ సురేపల్లి నందా అభివర్ణించారు. గందరగోళం, నిరుత్సాహం, నైతిక సం దిగ్ధతలలో ఇది వెలిగే దీపంలా మారుతుందని అన్నారు. వి.వి. లక్ష్మీనారాయణ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా సందేశాన్ని అందించారు.
ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కు రు అనే మొదటి శ్లోకం అర్థాన్ని వివరిస్తూ, మ నం ఎక్కడ ఉన్నా ధర్మాన్ని నిలబెట్టాలన్నా రు. స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి భగవద్గీతను అంతర్ముఖ సాధనకు మార్గదర్శకంగా వివరించారు. కురుక్షేత్రయుద్ధం మనసులోని అంతర్గ త సంఘర్షణలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
భయం, అహంకారం, గందరగోళాన్ని జ్ఞానం తో జయించాల్సిన అవసరాన్ని చెప్పారు. కార్యక్రమానికి ప్లాంజేరి ఫౌండేషన్ ఛైర్మన్ శంకర్ నారాయణ ప్లాంజేరి, జె.జె. ఆసుపత్రి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎల్.జయంతి రెడ్డి, మరకత శివలింగ అంతర్జాతీయ ప్రచార కమిటీ ఛైర్మన్ ధూపటి దయాకర స్వామి హాజరయ్యారు.