02-12-2025 01:49:11 AM
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 1(విజయక్రాం తి): తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 16వ వర్ధంతిని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బయ్య స్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశో క్ ముదిరాజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా హనుమకొండ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ కిష్టయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లా డుతూ.. పోలీస్ కిష్టయ్య ఆశయ సాధనలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ముందుంటుందన్నారు. పోలీస్ కిష్టయ్యను ముదిరాజ్ జాతి, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకట వ తేదీన పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ వర్ధంతి ని అధికారికంగా నిర్వహించాలని, గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో అలాగే అన్ని పోలీ స్ స్టేషన్ల వద్ద పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పా టు చేయాలని కోరారు. పాఠ్య పుస్తకాలలో కిష్టయ్య జీవిత చరిత్రను చేర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దువ్వ నవీన్ ముదిరాజ్, దువ్వ కనకరాజ్ ముదిరాజ్, గోనెల అనురాధ ముదిరాజ్, కేశబోయిన శ్రవణ్ ముదిరాజ్,చుంచు కృష్ణ, బుల్లెట్ వెంకన్న ముది రాజ్, బిల్ల శివ ముదిరాజ్, పోలు రాజు ముదిరాజ్, కౌతం విరమల్లు ముదిరాజ్, పెగడిపల్లి రాజు ముదిరాజ్, దేశాయి పేట రాజు ముద్రణ, కడిపికొండ వెంకటేశ్వర్లు ముదిరాజ్,దేవేందర్ ముదిరాజ్,చంద్ర శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.