calender_icon.png 11 July, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో విడత రుణమాఫీపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

09-08-2024 03:49:33 PM

హైదరాబాద్: జులైలో రెండోదఫా రుణమాఫీ చేశామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక దఫా రైతు రుణమాఫీ చేశామన్నారు..లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేశామని పేర్కొన్నారు. రుణమాఫీతో 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రెండు దఫాలు కలిపి 12 వేల 289 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్న భట్టి విక్రమార్క ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్ట్ లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్నామ భట్టి విక్రమార్క పేర్కొన్నారు.