14-10-2025 01:43:32 AM
ఆయన భార్య అమ్నీత్‌తో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఇటీవల చండీగఢ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. అలాగే పూరణ్ కుమార్ భార్య, ఐఏఎస్ అమ్నీత్ ను ఫోన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భట్టి విక్రమార్క మాట్లాడించారు.
దేశంలోని అత్యున్నత సర్వీసులో పనిచేస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారికే సామాజిక న్యాయం దక్కని పరిస్థితులు ఉన్నాయని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చండీగఢ్ చీఫ్ సెక్రటరీ రాజేష్ ప్రసాద్‌ను డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు, సంవిధాన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్‌తో కలిసి పూరణ్ కుమార్ భార్య అమ్నీత్, తండ్రి విజయకుమార్, తల్లి సుశీలను డిప్యూటీ సీఎం పరామర్శించారు.