02-01-2026 12:28:47 AM
వాంకిడి, జనవరి 1(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్లో గురువారం 208వ భీమా కోరేగావ్ శౌర్య దివస్తో పాటు నూతన సంవత్సర వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ గౌతమ బుద్ధుడు, డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి బుద్ధ వందనం చేశారు.1818 జనవరి 1న భీమా కోరేగావ్లో అంటరానితనానికి వ్యతిరేకంగా మహార్ బెటాలియన్ వీరోచి తంగా పోరాడి సాధించిన విజ యాన్ని స్మరించుకుంటూ ఈ శౌర్య దివస్ను నిర్వహిస్తు న్నట్లు నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షు డు అశోక్ మహుల్కర్, సమ తా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్, మండల అధ్య క్షుడు దుర్గం దుర్గాజీ, ప్రధాన కార్యదర్శి విజయ్ ఉప్రే, వాంకి డి సర్పంచ్ చునార్కర్ సతీష్, ఉపసర్పంచ్ దీపక్ ముండే, కార్యదర్శి రోషన్ ఉప్రే, సమాజ్ అధ్యక్షుడు శ్యామ్రావు లహు జీ దుర్గే, రాజేశ్వర్ ఉప్రే, రమా బాయి మహిళా మండలి, సిద్ధా ర్థ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.