02-01-2026 12:30:40 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి ౧ (విజయక్రాంతి): రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రానుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ సల్మాన్ ఖాన్, అఫ్జల్, నసిర్ ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోవా లక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారానే ఆ పార్టీకి తగిన గుణపా ఠం చెబుతారని అన్నారు.
కేసీఆర్ హయాంలో బడుగు, బలహీన వర్గాలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. నూతన సంవత్సరం సంద ర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మిని సింగరేణి జీఎం, డిడబ్ల్యు ఓ,ఇరిగేషన్ ఈ ఈ,నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులతోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.వివిధ పత్రిక నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నాయకురాలు సరస్వతి, రాజంపేట సర్పంచ్ పోచ్చయ్య, నాయకులు అలీబిన్ హైమద్, వెంకన్న, గం ధం శ్రీనివాస్, సిహెచ్ రవి, నిసర్ ,హైమద్, అమర్, జావిద్, తదితరులు పాల్గొన్నారు.