calender_icon.png 2 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి నిర్మాణానికి సాయం.. ఎన్నారైకి సన్మానం

02-01-2026 12:27:03 AM

భైంసా, జనవరి ౧ (విజయక్రాంతి): పుట్టి పెరిగిన ఊరుపై మమకారాన్ని పంచుతూ తాను చదువుకున్న ఊరిలో సొంత 30 లక్షల నిధులతో పాఠశాల భవన నిర్మాణాన్ని నిర్మించిన ఎన్నారై గందే ప్రదీప్ కుమార్‌ను గ్రామ స్తులు సన్మానం చేశారు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డ గందే ప్రదీప్ దంపతులు సొంత స్థలం కొనిచ్చి ఉన్నత పాఠశాల భవన నిర్మాణాన్ని చేపట్టి గంధ భోజన స్మారక ఉన్నత పాఠశాలగా నామకరణం చేశారు. అమెరికాలో ఉన్న ఆయన గురువారం సొంత గ్రామానికి వచ్చి పాఠశాలకు వెళ్లగా స్థానిక సర్పంచ్ రవి పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానం చేశారు.