16-07-2025 01:13:16 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లొ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ యువ నాయకుడు సోమవార్ మహేష్ ముగ్డే వార్ బస్వంత్ రావ్ పటేల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల(Indiramma houses) లబ్ది చేకూర్చేందుకు జుక్కల్ ఎమ్మెల్యేకృషిచేస్తున్నారన్నారుఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో యువ నాయకుడు మహేష్ ముగ్డే వార్ బస్వంత్ రావ్ పటేల్ ములేవార్ అశోక్ గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరమరెడ్డి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.