calender_icon.png 27 October, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో2కు కిషన్‌రెడ్డే అడ్డం

27-10-2025 02:05:36 AM

-మంత్రుల మధ్య పంచాయితీ ముగిసిన అధ్యాయం 

-కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం అందడం లేదు 

-జూబ్లీహిల్స్‌లో 10 ఏళ్లు బీఆర్‌ఎస్సే.. ఓట్ చోరీ చేసిందెవరు?

-పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి) : హైదరాబాద్‌లో మెట్రోఫేజ్- 2కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే అడ్డంకిగా మారారని,  మెట్రోను తీసుకొచ్చే బాధ్యత ఆయనకు లేదా అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మంత్రుల పంచాయితీ ముగిసిన అధ్యాయం అని పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. కులా ల గురించి మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మాట్లాడి ఉండాల్సింది కాద ని, ఎవరు ఎక్కడైనా కులాల గురించి, మతా ల గురించి మాట్లాడటం ఆక్షేపణీయమన్నా రు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

కొండా సురేఖ ఓఎస్డీ విషయంలో పోలీసులు రావడంతో తాను పానిక్ అయినట్లు సుస్మిత చెప్పారని తెలిపారు. ఎంత ఎదిగితే అంత ఒదగాలని, గోడలకు చెవులు ఉండే సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. కొండా ఓఎస్డీ విషయంలో పోలీసులది కమ్యూనికేషన్ గ్యాప్ అని దీనిని కేటీఆర్, హరీశ్ రావు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ర్టంలో అన్ని పరిస్థితులనూ హైకమాండ్ గమనిస్తోందని అందరం హైకమాండ్ రాడార్లో ఉన్నామని చెప్పారు.

కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం అందడం లేదని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చెయ్యాలన్నారు. బీజేపీకి ఎప్పు డూ మతం పేరుతో ఓట్లు దండుకోవడమే కదా..? అని విమర్శించారు. కేంద్రమంత్రిగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌కు ఏమి చేశారో కిషన్‌రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి చిల్లరగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

కేసీఆర్‌ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం.. 

కాంగ్రెస్ పాలనలో ఒక్కో నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం మా సంస్కృతి కాదని, మాగంటి కుటుంబ విషయాలు.. మీడియాలో చూశాకే తెలుసని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో 10 ఏళ్లు బీఆర్‌ఎస్సే గెలిచిందని మరి ఓట్ చోరీ ఎవ్వరు చేశారని ఆయన నిలదీశారు. ఓట్ చోరీపై తొలుత ఫిర్యాదు చేసింది రేవంత్ రెడ్డినే అని అన్నారు. అధికారులు, మంత్రు లు ఎవరైనా జవాబుదారీ తనంగా ఉండాలన్నారు. కేసీఆర్‌ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తామని అయితే కేసీఆర్ పాలన మాత్రం గాడి తప్పి రాష్ర్టం దివాలా తీసే పరిస్థితి తెచ్చిందన్నారు. బనకచర్ల విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించారని ఆయన  విమర్శించారు. కవిత వాస్తవాలు మాట్లాడాలని, గత పదేళ్ల పాలనలో కవిత భాగస్వామిగా ఉంది.. అప్పుడు అమరవీరులకు ఎందుకు న్యాయం చేయలేదని ఆయన నిలదీశారు. 

ఎమ్మెల్యేలకు డీసీసీ ఛాన్స్.. 

కొంతమంది ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ కీలక విషయాలు వెల్లడించారు. మంత్రి ఉత్తకుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేశారని,  కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీ బాధ్యతలు తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు డబుల్ పోస్టులుగా చూడబోమని ఆయ న స్పష్టం చేశారు. రెండు పదవులు ఉం డొద్దు అనే నిబంధన ఉందని ఒక పదవికి సెలెక్ట్ అయితే ఇంకో పదవికి రాజీ నామా చేస్తారన్నారు. డీసీసీల ఎంపిక విషయంలో అధిష్ఠానం మా అభిప్రాయాలను తీసుకుందని, ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి  తన అభిప్రాయాలను పంపారని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మధ్య గురుశిష్యుల బంధం అన్నారు. అన్నింటికంటే పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాలన్నారు.