23-11-2025 12:00:00 AM
చిట్యాల, నవంబర్ 22 (విజయక్రాంతి): ద్విచక్రవాహనం చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన శనివారం నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన డిగ్రీ విద్యార్థి నకిరేకంటి కౌశిక్ (20) హైదరాబాదులోని తన అన్న వద్దకు వెళ్లి బైక్‌పై శనివారం తెల్లవారుజామున తిరుగుపయణమయ్యాడు. చిట్యా ల మండలం గుండ్రాంపల్లి గ్రామ సమీపం లో జాతీయ రహదారి 65 వద్ద రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.