23-11-2025 12:00:00 AM
కొట్టి చంపిన జనం
పాపన్నపేట, నవంబర్ 22 (విజయక్రాంతి): మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని పాతూరు వాడలో శనివారం రాత్రి భారీ కొండచిలువ కలకలం రేపింది. భారీ కాయంతో ఉన్న ఐదు అడుగుల కొండచిలువ జనావాసాల్లోకి వచ్చింది.
కొండచిలువను చూసి ప్రజలు బెంబేలెత్తిపోయారు. రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. జనావాసాల్లో పొదలు, చెత్త పేరుకుపోవడంతో విష పురుగులు జనాల మధ్యకు వస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.