calender_icon.png 9 July, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నా వ్యాపారి హత్య కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్

09-07-2025 12:47:44 AM

వ్యాపారి అశోక్ సాగాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పట్నా, జూలై 8: బీహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ్ల.. ఖేమ్కా హత్యరాజకీయంగా తీవ్ర దుమా రం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అశోక్ సాగా అనే వ్యాపారిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూవివాదా ల నేపథ్యంలో ఇతడు గోపాల్ ఖేమ్కా హత్యకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన ప్రకారం గోపాల్ ఖేమ్కాను హతమార్చేందుకు అశోక్ సాగా, ఉమేశ్ యాదవ్ అనే షూ టర్‌కు రూ.10 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడు. రూ.లక్ష ముందుగానే ముట్టజెప్పి, మిగ తా మొత్తాన్ని పనిపూర్తయిన తర్వాత అందించేలా ఒప్పందం కుదిరిందని పో లీసులు వెల్లడించారు.

ఉమేశ్‌ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. హత్యకు ఉపయోగించిన బైక్, పిస్టల్, 80 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, రెండు ఫోన్లు, రూ.లక్ష నగదును పోలీసులు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నేరం చేసిన తర్వాత ఉమేశ్ యాదవ్ కొంతకా లం ఉదయగిరి అపార్ట్‌మెంట్‌లో ఆశ్ర యం పొందినట్టు తెలిసింది. ఈ అపార్ట్ మెంట్‌కూడా ఓ ప్రముఖ వ్యాపారిదని తెలుస్తోంది.

కాగా ఈ కేసులో మరో నిందితుడైన వికాస్ అలియాస్ రాజా హతమయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాజా చనిపోయాడు. ఘటనా స్థలంలో తుపాకీ, బుల్లెట్, కార్ట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు.