calender_icon.png 7 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినోదం పంచుతూ.. యాక్షన్‌తో మెప్పిస్తూ..

05-01-2026 12:00:00 AM

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ’మన శంకర వర ప్రసాద్ గారు’తో పండుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. ఆదివారం మేకర్స్ తిరుపతిలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఒకప్పుడు దేశ భద్రతా సంస్థల్లో కీలకంగా సేవలందించిన శంకర వర ప్రసాద్, శశిరేఖను ప్రేమించి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కి మారుతాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా ప్రశాంతంగా కనిపించినా, అతనిలోని వింటేజ్ ఫైర్, నేచురల్ ఇన్‌స్టింక్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు.

ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వచ్చినప్పుడు, వాటిని శంకర వర ప్రసాద్ తనదైన స్టైల్లో ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ ప్రధానాంశం. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవిని హిలేరియస్ రోల్లో చూడటం ప్రేక్షకులకు మెగా ట్రీట్ గా నిలిచింది. ఆయన గ్రేస్, స్వాగ్, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. అన్నీ కలిసి ఎందుకు ఆయన ‘మెగాస్టార్’ అనిపించుకుంటారో మరోసారి గుర్తు చేస్తాయి. వెంకటేష్ పవర్ఫుల్ మాస్ ఎంట్రీ ప్రేక్షకులను ఎక్సైట్ మెంట్‌ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ ఇద్దరు స్టార్స్ మధ్య వచ్చే కెమిస్ట్రీ, సరదా పంచ్ డైలాగ్స్ అభిమానులకు విజువల్ ఫీస్ట్గా నిలుస్తాయి.

నయనతార సంప్రదాయంగా, ఎంతో అందంగా కనిపిస్తూ, చిరంజీవితో ఆమె కెమిస్ట్రీ ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా కనెక్ట్ చేస్తుంది. సచిన్ ఖేడేకర్ తన పాత్రలో పూర్తిగా లీనమై నటించగా, మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన మ్యాజిక్ ని చూపించారు. మెగాస్టార్ను వింటేజ్, కరిష్మాటిక్ గా చూపడమే కాకుండా, వినోదంయాక్షన్లను సమతూకంగా మేళవించి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ను రూపొందించారు. చిరంజీవిని అద్భుతంగా ప్రెజెంట్ చేయడం, వెంకటేష్ను కథలో కీలకంగా తీసుకురావడం సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్స్. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ స్టైలిష్గా, వైబ్రెంట్గా ఉండగా, భీమ్స్ సిసిరోలియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నోస్టాల్జిక్ ఫీల్ను అందిస్తుంది. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ సినిమా వరల్ కి మంచి రిచ్నెస్ను తీసుకొచ్చింది. షైన్ స్క్రీన్స్, గోల్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ప్రొడక్షన్ వాల్యూస్ను అత్యున్నతంగా వున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.